దీపావళి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 కారు చీకటి నలుపులో 
తళుక్కుమన్న ఆ ఛమక్కే 
మీకు దీపావళి కావాలి!
అమావాస్య నిశీధిలో 
ఆకాశపు నీలి తెరపైని
నక్షత్రాల ముగ్గు 
మీకు దీపావళి కావాలి! 
అలుముకున్న శిశిర చీకట్లపై
ఉప్పొంగిన ఆనందపు 
శరత్తుల కెరటాలు 
మీకు దీపావళి కావాలి!
మీ అధరాలపై విరిసిన
సీతాకోకచిలుకల దరహాసం 
మీకు దీపావళి కావాలి!
మీరు ఆడిపాడిన బాల్యజ్ఞాపకాలు
మీకు దీపావళి కావాలి!
మీ చిన్ననాటి స్నేహితుల
ఆత్మీయుల తలపులు
మీకు దీపావళి కావాలి!
మీ పిల్లల గలగల నవ్వులు
మీకు దీపావళి కావాలి!
మీ ఇంట అందరి ఆయురారోగ్యాలు
మీకు దీపావళి కావాలి!
*********************************
.

కామెంట్‌లు