మనిషి;- - తమిళ కవి కణ్ణదాసన్- అనుసృజన - జయా
నవ్వులో 
మనిషి లేడు
ఏడుపులో
మనిషి లేడు
హృదయంలో 
మనిషి లేడు
నిద్రలో 
మనిషున్నాడు

జీవిస్తున్నప్పుడు
మృగం
పడుకున్నప్పుడు 
దైవం
ఈ రెండిటి నడుమ
మనిషి
ఎక్కడో అక్కడ ఒకడు
ఉంటే
అతనికి
ప్రపంచం దణ్ణం పెడుతుంది

ఇంతకూ
ఎవరు మనిషక్కడ?!


కామెంట్‌లు