రాజకీయ భంగపాటు;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
1. ఆవె: టికెటు వచ్చి నయ్య టెక్కును జూపెను
రాని వారు పొందు రట్ట డెంతొ
రాజ కీయ మందు రాగాలు ద్వేషాలు
రగులు తుండు నెపుడు రౌద్ర ముగను

2.ఆవె:సేవ జేసి నయ్య సిద్ధిని కోరేను
నాయ కుండు నైన న్యాయ ముగను
రాజకీయ మందు లబ్ధిని నాశించి
పొచ్చె మొందు వారు బొచ్చె డుండ్రు

కామెంట్‌లు