నీతి పద్యాలు ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
ఆవె:నీరు లేని చెరువు నీడనియ్యని చెట్టు
నిరుపయోగ మేగ నేల పైన
రొక్కమంటు లేని చొక్కాయి సంచున్న
 నాదరించ రాదు నంగరేకు

ఆవె:ప్రేమలేని మనసు ప్రీతెట్ల నొందును
కరుణ మాయ మయ్యి కఠిన మౌను
క్రోధ ముండ నందు క్రూరంగ మారును
నాయ మెర్గ లేక నాశ మొందు

ఆవె:పచ్చనోటు దెచ్చు పగ ప్రతికారాలు
పచ్చ కాపురాల్లొ చిచ్చు బెట్టు
స్వచ్చ మనసు లోన స్వార్థము నింపును
నిచ్చలమును బాపి నీతి మాపు 

కామెంట్‌లు