నేటి రాజకీయము ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
1.ఆవె:రాజు మారు నేమొ రాజ్యము మారునా
పాలకుండు నడువ పాత బాట 
పట్టపయ్య ప్రజను పట్టించు కోకున్న
ప్రజల పాట్లు ముదిరి బ్రతుకు చెడును

2.ఆవె:నోటు కున్న శక్తి వోటుకు లేదుగా
నోటు జూడ గానె వోటు వంగి
జేయు నూడి గమ్ము సేవకుండుగమారి
చెప్పి నట్టు వినును చేవ మరచి

కామెంట్‌లు