ధనము పై పద్యాలు ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
1.ఆవె:ధనము లేని వాన్ని దరిచేర నీయరు
ధనము యున్న వాడు దరికి రాడు
ఒడమి నేర్పు నదియు వొంటరి తనమును
మాత్ర సత్య మిదియె మనిషి నెరుగ

2.ఆవె:ధనము యున్న వారు దండము జూపేరు
నిర్ధనున్ని జూసి నింద జేయు
క్షత్త్రముండ బోదు కలకాల మెప్పుడు
ధణియ నెరిగి నడువు దండ మిడిచి

కామెంట్‌లు