అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811322.
 రెడ్డిగారు వారసత్వస్థలాలు చారిత్రక కట్టడాలను చూడ్డానికి పల్నాడు వెళుతున్నప్పుడు  ప్రతిసారి మా ప్రకాశం జిల్లా కూడా రావచ్చు కదా అని ప్రముఖ చరిత్రకారుడు విద్వాన్ డాక్టర్ జ్యోతి రామచంద్ర మౌళి గారు  అన్న మాట గుర్తుకొచ్చింది  గుర్తుకు రావటమే కాదు పల్నాటికి పయనం కట్టినప్పుడల్లా రెడ్డి గారి కళ్ళ ముందు వాలిపోతుండేవాడు. అయినా అటువైపు వెళ్ళటం కుదరలేదు  ఎప్పట్లాగానే ఒక శనివారం నాడు పల్నాడు లోని మాచర్ల జమ్మలమడక తుమ్మూరు కోట  మల్లవరం చూసి రావడానికి ఏర్పాటు చేసుకొని తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి  మాచర్ల వైపు వెళదామని డ్రైవర్ శివకు చెప్పి సంచి సర్దుకుంటున్నానో లేదో జ్యోతి చంద్రమోడి గారి ఫోన్ చేసి ఆ దగ్గర మనీ నా చేత ఒప్పించి దారి మళ్ళించారు. రాత్రి 9 గంటలకు మళ్ళీ ఆఫీస్ కి వెళ్లి ప్రకాశం గుంటూరు జిల్లాల మ్యాపులు తీసుకొని ప్రయాణం గురించి డ్రైవర్కి ఇలా సహోదయోగి దుర్గా సాగర్ కి తెలియజేసి ఇంటికి వచ్చి నిద్రపోయారు. నిద్రపడితే కదా ప్రకాశం జిల్లా అనగానే అద్దంకి పాండురంగని శాసనం ధర్మవరం జైన వసతి దర్శి దేవాలయం పొదిలి కట్టడాలు కనిగిరి కోట కళ్ళ ముందు ముసురుతున్నాయి మానసిక తర్జన పరిచర్ల మధ్య మణికేశ్వరం  సురవేశ్వర కోన వెళదాం అనుకున్నారు  కాదు కొన్ని జనా చదలవాడా చందలూరు అయితే బాగుంటుంది అనిపించింది  కాదు కాదు మాలకొండ సింగరకొండ సింగరాయకొండ మెట్టపాలెం చర్లపల్లి చూద్దామనుకున్నారు  అన్ని గందర గోళాల మధ్య కాటమరాజు తిరగాడిన కలిగిరి పాలేటి గంగ పంచలింగాలకొండ పులి గోడు గంగ దొనకొండ వల్లూరు కురిచేడు వెళ్ళొస్తే బాగుంటుందని  మనసులో స్థిర  పునుగోడు గంగ దొనకొండ వల్లూరు కుడిచెడు వెలిస్తే బాగుంటుంది అని మనసును స్థిరపరచుకున్నారు రెడ్డి గారు వీరగాథల గురించి విస్తృత పరిశోధనలు గావించిన  డాక్టర్ సంగిరాల వెంకట సుబ్బారావు గారు గుర్తొచ్చి ఈ పర్యటన స్థలాల వరుసను ఎంపిక చేసుకోవడంలో  పరోక్షంగా సహకరించారు. మారిన బాట గురించి డ్రైవర్ కు జ్యోతి చంద్రమౌళి గారికి తెలియజేశారు రెడ్డి గారు చంద్రమౌళి గారు ఏమో అద్దంకి ధర్మవరం అలమలూరు మణికేశ్వరం చూద్దామనుకున్నారు కాదని నా చూపు ఇప్పుడు కనిగిరి వైపు అని కరాకండిగా చెప్పాను సరేనన్నా ఆయన కనిగిరి కరుణానిధికి ఒకసారి ఫోన్ చేయమన్నారు. అప్పటికే రాత్రి 11 గంటలకు అయింది కరుణానిధితో తరువాతి రోజు కనిగిరి వస్తున్నాము మొదటగా నేలటూరి గొల్లపల్లిలోని ఇనుప యుగపు సమాధులు చూద్దాం  ఉదయం ఆరింటికి సిద్ధంగా ఉండమన్నారు రెడ్డిగారు.



కామెంట్‌లు