ద్రౌపది- ఏ.బి ఆనంద్- ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322

 అప్పుడు ధర్మరాజు ద్రౌపదిని  సమాధానపరుస్తూ ఓ ద్రౌపదీ నీవు కొంచెము నాస్తిక వాదమునకు సమీపంలో ఉన్నావు. నేను కర్మఫలము ననుభవించుటకు కర్మ చేయుట లేదు దానము చేయుట ధర్మము కనుక దానము చేస్తాను యజ్ఞము చేయవలసి ఉన్నది కనుక  నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానే కానీ ఫలితాలను ఆశించను  అన్నప్పుడు ద్రౌపతి నేను విపత్తిలో ఉన్నాను కావున ఇలాంటి ప్రలాపన చేస్తున్నాను అన్నది  ఈ సంవాదం వింటున్న భీమసేనునిలో కోపము మేల్కొన్నది  అతడు నేడే సుదినముగా భావించి కౌరవులతో యుద్ధం చేయుటకు సమ్మతించండి అనగానే ధర్మరాజు  కేవలం సాహసంతో పనులు నెరవేరవు అన్నాడు ఇంతలో వేద వ్యాసుడు వారు అక్కడికి వచ్చారు. ఒకసారి పాండవులు కామ్యక వనంలో ఆశ్రమంలో ద్రౌపదిని ఒంటరిగా వదిలి పండ్లు ఫలాల నిమిత్తం అడవులోనికి వెళ్లారు అదే సమయంలో జైయద్రదుడు ఇతర రాజులతో కలిసి పాండవుల ఆశ్రమం ముందుగా వెళుతూ ద్రౌపదిని చూసి మోహించాడు  ద్రౌపది సౌందర్యాన్ని మోహించి దిగ్భ్రామ చెందిన జైయద్రదుడు ద్రౌపదిని సమీపించి మీరు ఎవరు అని ప్రశ్నించాడు  నేను ద్రుపద రాజు కుమార్తెను పాండవుల సతిని అని జవాబిచ్చింది జైయద్రదుడు మోహితుడై పాండవులను వదిలి తనతో వచ్చిన ఎడల ఆమెను పట్టమనిషిని చేస్తానని చెప్పాడు ద్రౌపది పట్టరాని కోపంతో నీకు మూడింది కనుకనే కన్ను నిన్ను  కానరా కున్నది అని గట్టిగా  మందలించింది  అయినప్పటికీ జైయద్రదుడు బలవంతంగా ద్రౌపదిని తన రథం పై ఎక్కించుకొని బయలుదేరాడు.
ద్రౌపది బిగ్గరగా ధౌమ్యుని పిలిచింది ధౌమ్యుడు పరిగెత్తుకొని వచ్చి కాలినడకనే రథమును వెంబడించాడు ఒక పాండవులు కూడా ఏదో అపశకునంతోచి పరుగు పడుకొని వచ్చారు ఆశ్రమంలోని దాసి విషయం వివరించింది పట్టరాని ఆగ్రహంతో పాండవులు తమ తమ  రథముల పై జైయద్రదుడు  సైన్యాన్ని సమీపించారు రథం వెనుక ఆక్రందన చేస్తూ పరిగెత్తుతున్న ధౌమ్యుని నింపాదిగా ఉండమని చెప్పాడు జైయద్రదుని రథంలోనున్న ద్రౌపదిని చూసిన పాండవుల క్రోధం కట్టలు తెరుచుకుంది. అర్జునుడి బాణ వర్షంతో అంధకారం కమ్ముకుంది. జైయద్రదుని సైనికులు నమస్కరిస్తున్నారు భయంతో సౌముడు రథం ముందు ఉన్న ఏనుగులను, సైనికులను తన గదతో సంహరిస్తున్నాడు.
కామెంట్‌లు