ఎందుకు? ఎందుకు?- -గద్వాల సోమన్న,9966414580
పూలు లేని తోటలెందుకు?
జాలి లేని మనసులెందుకు?
మొలకలు లేని మడులెందుకు?
గెలుపు లేని పోరు ఎందుకు?

జలము లేని చెరువులెందుకు?
ఫలము లేని తరువులెందుకు?
చెలిమి లేని బ్రతుకులెందుకు?
బలము లేని  తనువులెందుకు?

తరువులు లేని పుడమి ఎందుకు?
గురువు

లు లేని విద్యలెందుకు?
పరువు లేని జీవితమెందుకు?
మరులు లేని మనువులెందుకు?

వనితలు లేని గృహములెందుకు?
మమతలు లేని జగమెందుకు?
సమతలు లేని సమాజమెందుకు?
బాలలు లేని బడులెందుకు?

కామెంట్‌లు