తూర్పు దిక్కు;- -గద్వాల సోమన్న,9966414580
తూర్పు తెలతెలవారింది
వెలుగు పూవులు పూసింది
చీకటి తెరలను చీల్చుతూ
ఉదయరాగం పాడింది

జీవులను నిద్ర లేపింది
సోమరితనం తరిమింది
పక్షుల కిలకిలరావాలకు
స్వాగతం పలికింది

తూర్పు వైపు  సూర్యునికి
జన్మ స్థలమే వీరునికి
తూర్పమ్మకు సుపుత్రుడు
జీవకోటికి స్నేహితుడు

శుభ సూచికమే తూర్పు
పాఠాలెన్నో నేర్పు
ప్రాతఃకాలము శాంతము
ఇష్టపడును హృదయము


కామెంట్‌లు