మా మేనత్త;- -గద్వాల సోమన్న,9966414580
మా నాన్నకు చెల్లెలు
మనసేమో మల్లెలు
మేనత్తకు ప్రేమలు
మా మీద కోకొల్లలు

మా ఇంటికి వస్తుంది
బొమ్మలను  తెస్తుంది
ప్రేమగా ఎత్తుకొని
ముద్దులను పెడుతుంది

కబురులెన్నొ చెపుతుంది
కడుపును నింపుతుంది
ఒడిలోన పెట్టుకుని
మా తలలు నిమురుతుంది

అత్త మాకు ఇష్టము
గుణం చూడ శ్రేష్టము
ఎక్కడున్నా తనకు
మేమంటే ప్రాణము


కామెంట్‌లు