ఎవరు?...ఎవరు?- -గద్వాల సోమన్న,9966414580
కోకిలమ్మ గళంలోన
కమ్మదనం రాసిందెవరు?
కవీంద్రుల కలంలోన
కవిత్వాన్ని పోసిందెవరు?

పసి పిల్లల మోములోన
చిరునవ్వులద్దిందెవరు?
మల్లెపూల వనంలోన
తావులను రువ్విందెవరు?

చిన్నారుల నోటిలోన
సత్యాలు వ్రాసిందెవరు? 
గలగల పారు ఏటిలోన
జలరాశులు నింపిందెవరు?

అందమైన ప్రకృతిలోన
పచ్చదనం పెంచిందెవరు?
ముద్దులొలుకు పాపలోన
చక్కదనం పంచిందెవరు?


కామెంట్‌లు