మేటి మాటలు- -గద్వాల సోమన్న,9966414580
చదవాలి చక్కగా
ఎదగాలి గొప్పగా
అతి చిన్ని బ్రతుకులో
ఉండాలి హాయిగా

మురియాలి మెండుగా
విరియాలి పూవుగా
జీవిత నావలో
సాగాలి సొంపుగా

మారాలి మాలగా
మసలాలి ముద్దుగా
మానవత్వంతోడ
కదలాలి మంచిగా

నడవాలి తోడుగా
పొడవాలి చుక్కగా
ఉన్నత లక్ష్యంతో
పోవాలి సూటిగా


కామెంట్‌లు