కవితాఝరులు- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితల
అమృతంకురిపిస్తా
గొంతుకలు
తడుపుకోమంటా

కవితల
విందునిస్తా
కడుపులు
నింపుకోమంటా

కవితల
కుసుమాలుచల్లుతా
పొంకాలను
చూడమంటా

కవితల
సౌరభాలువెదజల్లుతా
పరిసరాలను
పరవశపరుస్తా

కవితల
వరదపారిస్తా
కల్మషాలను
కడిగేస్తా

కవితల
జల్లుకురిపిస్తా
తనువులుతడిపేస్తా
మనసులుమురిపిస్తా

కవితల
పంటలుపండిస్తా
కమ్మనిరుచులు
అందిస్తా

కవితల
సాగరాన్నిచిలుకుతా
వెన్నపూసని
వెలికితీసియందిస్తా

కవితల
పిపాసకలిగిస్తా
కమ్మనికైతలిని
త్రాగిస్తా

కవితల
రాగాలుతీస్తా
కర్ణాలకింపు
కలిగిస్తా

కవితల
జ్వాలనురగిలిస్తా
కవితలచుట్టు
తిప్పిస్తా

కవితల
చతురతచూపిస్తా
చదువరులను
సంతసపరుస్తా

కవితలకొరకు
కాచుకోమంటా
కవితారసమును
క్రోలుకోమంటా


కామెంట్‌లు