తిరుమలరావుకు ఘంటసాల స్మారక సత్కారం

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు,    ఘంటసాల స్మారక సత్కారాన్ని పొందారు. 
విజయనగరం జిల్లా, బొబ్బిలిలో  
ఘంటసాల జయంతోత్సవాలలో భాగంగా, పాటల దేవునికి స్వర నీరాజనం పేరిట నిర్వహించిన సంగీత విభావరిలో తిరుమలరావు ఘంటసాల పాటను ఆలపించీ సన్మానం పొందారు. 
యంగ్ మెన్స్ హేపీ క్లబ్, ఆనందోబ్రహ్మ, శ్రీకళాభారతి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ గానవిభావరిలో తిరుమలరావు పాల్గొని, అందరి ప్రశంసలు పొందారు. ఆనందనిలయం మూవీలో ఘంటసాల ఆలపించిన పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే అనే పాటను ఈ వేదికపై తిరుమలరావు ఆలపించారు. అనంతరం ప్రజానేత ప్రతినిధి శంబంగి వేణుగోపాలనాయుడు, యంగ్ మెన్స్ హేపీ క్లబ్ అధ్యక్షులు మింది విజయమోహనరావు, ఆనందోబ్రహ్మ ప్రధాన కార్యదర్శి పెదప్రోలు నాగరాజు, శ్రీకళాభారతి నిర్వాహకులు నంబియార్ వేణుగోపాలరావు, బొబ్బిలి రచనా సమాఖ్య సాహితీ కార్యదర్శి తాడుతూరి వెంకట రమణారావు, 
ఆనందోబ్రహ్మ కార్యవర్గ సభ్యులు చోడగంజి రమేష్ నాయుడు, మువ్వల శ్రీనివాసరావు, గెంబలి శ్రీనివాసరావు తదితరులు తిరుమలరావును ఘనంగా సన్మానించారు. 
సూపర్ సింగర్స్ అకాడమీ, 
పద్మశ్రీ ఘంటసాల ఫ్యాన్స్ అసోసియేషన్, పలు సంస్థల ప్రతినిధులు కరుణకుమార్, చప్ప అప్పలనాయుడు, డా.కె.వి.అప్పారావు, మరిశర్ల సింహాచలం, జి.గంగాధర్, సన్యాసిరావు, పల్ల సత్యన్నారాయణ, సాలూరు కబీర్ షా ఆర్కెస్ట్రా అండ్ పార్టీ ప్రతినిధులు సుమన్, సుమ, 
ఆరోగ్య శాఖ ఉద్యోగి ఎస్.మెహరున్నిషా బేగం తదితరులు తిరుమలరావు గానకళను అభినందించారు.
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల సంగీత విభావరిలో తాను పాల్గొనుట ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే అనే పాటను నేడు ఆలపించడానికి భీమునిపట్నంలో 1986లో టీచర్ ట్రైనింగ్ తోటి శిక్షణార్ధి కె.గంగన్నపడాల్ స్ఫూర్తి అని తెలిపారు. బొబ్బిలిలో తొలిసారిగా  ఘంటసాల స్వర నీరాజనం నిర్వహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తిరుమలరావు అన్నారు.
కామెంట్‌లు