సుప్రభాత కవిత - బృంద
కలలు కనే కళ్ళు
వేళ్ళూనే ఊహలు
మళ్లీ  మళ్లీ  వినిపించే
కళ్ళ వాకిట  పిలుపులు

ఎన్నుకున్న వన్నెలతో
కన్నుల కింపుగ మెరిసే
కమనీయ  వనమున
విరిసేను కోటిపువ్వులు

కోమల కుసుమాల
ఎలనవ్వుల సోయగము
ఇలకు స్వాగతించె
ఇనుని వైభవముగ

చిరుగాలుల చిలిపిమోతలు
ఉదయరాగాలాపనతో
ఉర్విని మేల్కొలిపె
ఉషస్సౌందర్యం చూడగా

తెలియని ఆనందం
కలుగుతున్నదని
తెలిసికొన్న హృదయం
తేలిపోతున్నది మేఘమై

అలవాటైన అద్భుతం
ఆకాశాన  ఆ

విర్భవిస్తే
అపురూపమైన ఆనందం
అంతరంగం అనుభవించదా?

ఆశలకు...మరో ఆవకాశమిస్తూ
వచ్చే అమూల్యమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు