జీవనగమనంలో....;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నిశ్శబ్దం
గొంతును నొక్కేస్తుంది
నిర్వేదం
మనసును త్రొక్కేస్తుంది

నిరీక్షణ
కాలాన్ని నిదానంచేస్తుంది
నిరాదరణ
మేనును క్రుంగదీస్తుంది

నిరాశ
అనందాన్ని దూరంచేస్తుంది
నిర్దాక్షణ్యం
మానవత్వాన్ని మంటకలుపుతుంది

నిర్లిప్తత
ఇష్టాలను వదిలిస్తుంది
నిర్లక్ష్యం
గమ్యాలను విడిపిస్తుంది

నియమం
చేతులు కట్టేస్తుంది
నిర్వాణం
వదలక వెంటబడుతుంది

నిస్సిగ్గు
వెధవపనులు చెయ్యిస్తుంది
నిసి
భయకంపనలు పుట్టిస్తుంది

నిరోధం
అడ్డగిస్తుంది
నిర్ధనం
అడుక్కోమంటుంది

నిట్టూర్పులు
గుండెతో ఆడుతాయి
నిర్మొహమాటాలు
సూటిగా నడిపిస్తాయి

చూచి
ముందుకునడువు
వేచి
తీసుకోచర్యలు

అనుకుంటే
అన్నీ జరుగవు
అనుకోకపోతే
జరిగేవీ ఆగవు


కామెంట్‌లు