చూపుల్ని నాటిన భూమిలో
సూర్యుళ్ళు పుడుతున్నట్లు
ఆకాశవాణి స్వరాలు లోకానికి వినిపిస్తున్నాయి.!
ఉదయపు యుద్ధభూమిలో
కిరణాల హత్యలు మామూలైపోతున్నాయి.!
వెనక్కి నెట్టిన కాలాన్ని
కాళ్లు చేతులు లేకుండానే
పరిగెత్తించినట్లు సమాచారం!!
పారుతున్న మౌనం
పర్వతాలను ముంచివేసినట్లు
శిఖరం పైన పావురం ఒకటి ఎగురుతున్నది!
భయం వీడిన నీడలు
అలంకరించుకున్నట్లు
అద్దాలు ఫిర్యాదు చేస్తున్నాయి!!.
కాలాతీత పత్రాలు
శిలా శాసనాలై దైవం ద్వారాల ముందు
తోరణాలై వేలాడుతున్నాయి.!!
నిక్కబొడుచుకున్న మర్మం
ధర్మం ప్రకారమే గడప దాటి
దేవుని మెడలోకి చేరుకుంటున్నాయి!!
ఆలస్యంగా నైనా నైతికత
సత్యం వింటే నడుస్తుంది ఆత్రుతతో!!
వెంటాడిన కొడవళ్ళు
అయస్కాంతం కాళ్ల దగ్గర కదలకుండా పడి ఉన్నాయి.!!
శతాబ్దాల నాటి శబ్దాలు కొన్ని
నిశ్శబ్దంగా పెద్ద పాముల్లా
కంఠాల్ని మింగేస్తున్నవీ!!!
ఎదిరించిన మత్తునిద్దురల్నీ
పరిమళాలు కలల్లా మెదిలి
మొగలి పొదల్ని దహిస్తున్నాయి!!.
కదలిక లాంటి అంతులేని సుతిమెత్తని మేఘాల్ని
గాలి మెల్లిగా ఎత్తుకొని పారిపోతుంది.!!
ఐరావతం తెచ్చిన పాలు
నింగికెగిసి నైవేద్యమై ఆలింగనం చేసుకుంటున్నాయి!!!
పొంగిపొర్లిన నీరులా
మురగలు కక్కిన కంఠాలు
రాళ్లపై తలలు పగలు కొట్టుకుంటున్నట్లు తెలుస్తుంది!!.
కదులుతున్న వరాలు దేవకన్యల్లా
సరోవరంలో రెక్కలు కట్టుకొని పక్షుల్లా వాలిపోతున్నాయి!!!!.
చిలక జోస్యం చెప్పించుకున్న సహస్రక్షుడు
మళ్లీ దేవలోకాన్ని గెలిచినట్లు శుభశకునం!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి