తెలుగుసేవే జీవనం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 దేశభాషలలోన తెలుగు మేలు 
తీయదనములోన తెలుగుమేలు 
ఆణిముత్యాల నెదిరించు గుండ్రనితనము 
అక్షరాలకు అమరింది పూల సొగసు 
పంచదార పనసతొనల రంగరింపు 
పునుగు కస్తూరి పరిమళాల మేళవింపు 
వెన్న తేనెల మృదువును వెక్కిరించే
అచ్చమైన తెలుగు మా అమ్మభాష 
తెలుగుమాటలు తెలుగుపాటలతో
దిక్కులన్నీ మారుమ్రోగాయి 
తెలుగుసీమ చరితలన్నీ
భూగోళము నిండి మెరిశాయి
తెలుగు కలిమి తెలుగు బలిమి
తెలుగు వీర ధీర చెలిమేగా
తెలుగుభాష సొగసే
వెలుగునింపు మనసంతా
తెలుగుపాట
కోకిలలకే గానం నేర్పింది
తెలుగు కన్నియ ఆట
నెమలికే నాట్యం నేర్పింది
తెలుగువాడి పలుకే
శాంతి సమతల కులికింది
అందుకే
తెలుగుభాష సేవనమే
కావాలి తెలుగు బిడ్డ జీవనం!!
********************************

కామెంట్‌లు