మారుతున్న జీవన చిత్రం;- సి.హెచ్.ప్రతాప్
జీవన ముఖ చిత్రం మారుతోంది
గ్లోబల్ వార్మింగ్ ,కాలుష్యం, కల్తీలు
మానవాళిని కాటేస్తున్నాయి

పుట్టగొడుగుల్లా వైరస్లు
పచ్చదనం కనుమరుగు
మహా వృక్షాలు నేలమట్టం
అరుదైన జీవజాతుల అంతం
జీవన వైరుధ్యం నాశనం
కాంక్రీట్ అరణ్యాలు విస్తరుస్తున్నాయి

అనైతికత,అశ్లీలత, అసభ్యత
ప్రేమ పేరుతో విచ్చలవిడితనం
నాటి నిషేధిత అలవాట్లు
నేడు ఆమోదయోగ్యం
నైతిక విలువలు అసమర్ధుల బలహీనత

నిత్యం సోషల్ మీడియాతో సహజీవనం
మానవ సంబంధాలు విచ్చిన్నం
కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం
అపార్ధాలు మర్రివృక్షాల్లా వేళ్ళూనుకుంటున్నాయి
వివాహాలు పెటాకులౌతున్నాయి
మానవులను కలిపేది ఆర్ధిక బంధమే

ఎదుటి బాధలు మనకొద్దు
మన జీవితమే మనకు ముద్దు
మనకు మాత్రమే సక్సెస్ కావాలి
మన పిల్లలు ఇంజనీర్లు ,డాక్టర్లు
పక్కింట్లో మాత్రం సైనికులు పుట్టాలి
అమెరికా డాలర్లలో సంపాదన
ఆర్నెల్లకొక జాలీ ట్రిప్
స్వార్ధమనే చట్రం లో బిగింపు.
పైగా ఎవరో వస్తారని
ఏదో చేస్తారని వృధా ఎదురుచూపులు 

కామెంట్‌లు