కౌసల్య;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322

 ధర్మబద్ధంగా పితృ వాక్య పరిపాలన చేయుట శ్రేయస్కరము తర్వాత తల్లితో కూడా అదే మాట చెప్తాడు ఆమె ఆశీర్వాదం తన  వనవాసకాలంలో సకల ఆపదల నుంచి విముక్తిని ఇస్తుంది అని శ్రీరాముని విశ్వాసం బిడ్డ నుంచి తల్లిదండ్రులు వియోగంతో జీవించడం మాటల్లో చెప్పలేనంత బాధాకరం అదే సమయంలో తన కుమారుడు ఎంత గొప్ప ధర్మ భక్త పరిపాలకుడు కావడం కూడా ఆనందాన్ని ఇచ్చేది బిడ్డ ఉదాత్త స్వభావానికి మురిసిపోతూ కౌసల్య తదేకంగా శ్రీరాముని వైపు చూస్తూ పరిస్థితులను అధిగమించే ధైర్యాన్ని పొందే రీతిలో ప్రవర్తిస్తుంది రమ నిన్ను దూరం చేసుకోవడం భరించలేను నీకు దూరమై జీవించలేను తల్లి వెదను గమనించిన శ్రీరాముడు ఆమెకు ధైర్య వచనాలు చెప్పి తండ్రి ఆజ్ఞను పాటించడమే కదమ్మా నేను వనవాసానికి వెళుతున్నది ధర్మం తప్పడం శ్రేయోదాయకం కాదు కదమ్మా అంటూ సవినయంగా ప్రేమతో ఊరడిస్తాడు కౌసల్యను
నీవు ఆయన భార్యగా ఆయన వచన పాలనలో సహకరించాలి కదా  ఇలా తమ్ముడు లక్ష్మణునితో తల్లితో అనేక విధాల అనునయ వచనాలతో ఓదార్పు కలిగిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ మాటలతో ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే తానెప్పుడూ మాత పితృ కోరికలు ఆలోచనకు వ్యతిరేకంగా నడుచుకునే స్వభావం కలవాడు కాదు అమ్మ నీవు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకమ్మా నేను నాతో అరణ్యానికి ఎలా తీసుకుపోవాలని నీ మాట జవతాటను కానీ ఈ పని ఎలా చేయగలను నాన్న మాటను నిలబెట్టుటకే కదా నేను వనవాసానికి వెళుతున్నది నీవు ఇక్కడ ఉండి అన్ని విషయాలు నిర్వహిస్తూ ఉంటే నేను అక్కడ ప్రశాంతంగా కాలం గడపగలను. ఈ మాటలకు కౌసల్య తనను తాను సమాధానపరచుకొని దుఃఖాన్ని భరిస్తూ విధి లీలకు చింతిస్తూ తనకు భగవంతుడు ఈ దుఃఖ భారాన్ని భరించే శక్తి ప్రసాదించాలని వేడుకుంది. ఈ విధంగా నిర్భరంతో దృఢ చిత్తం తో ధైర్యాన్ని పెంచుకొని  శ్రీరామునితో రమా నిన్ను వనవాసానికి ఆపలేకపోయాను నేను నీకు అనుమతి ఇవ్వడమే తప్ప మరో మార్గం లేదు నీకు అనుమతిస్తున్నాను నీవు వనవాసంలో ఏ ఆపద రాకుండా కాపాడి 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఈ ముసలిదానికి సంతోషాన్ని అందించేలా దయ చూపమని ప్రార్థిస్తాను నీలో నెలకొన్న  సద్గుణ సంపదే నిన్ను కాపాడుతుంది. విశ్వా మిత్రుని కృప వల్ల మీకు లభించిన సర్వ శక్తులు నిన్ను ఆపదల నుంచి రక్షించుగాక అవే నీ కవచములుగా నిలుస్తాయి.

కామెంట్‌లు