ఏక సంధాగ్రాహి వేంకటరాజు గారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎందరో ఋషులు గుహలలో ఉంటూ  ఎన్నో రహస్యాలను సేకరించి మంత్ర తంత్రాలతో మహిమ చూపుతూ ఉంటారు  వారిని చేరడం ఎవరి తరము  కాదు  అనేక గుహలను వెతకగా వెతకగా చివరికి ఎలాగో ఒక తాపస మూర్తిని కనుగొన్నాడు  తన మనసులో ఉన్న కోరికను చెప్పి ఎంతో ఆనందంతో  ఆ ముని ఎదుటగా నిలబడ్డాడు సీతారామరాజు  ఈ కుర్రవానిని చూస్తూ ఉంటే బాల సూర్యునిలా ఉన్నాడు  ఇంత చిన్న వయసులో ఇతనికి ఇంత వైరాగ్యం ఎలా వచ్చింది. నిజానికి తపస్సు చేయడానికి తగినవాడు ఇతను అని ఆలోచించి  ఆ తపస్సు అల్లూరి సీతారామరాజుకు ఉపదేశం ఇచ్చాడు. గురుదేవులకు దక్షణ ఇవ్వడానికి తన  దగ్గర ఏమున్నది  తన లక్ష్యాన్ని చేర్చిన గురువు కదా వారు. గురువు అంటేనే  ఈ ప్రపంచంలో ఎవరితోనూ పోల్చదగిన వ్యక్తి కాదు  భగవంతుడు తప్ప మరొకరు  పోలికకు తగరు అని తలచి తన హృదయాన్ని కానుకగా  ఆ తపసికి అందించాడు మనస్ఫూర్తిగా  అప్పుడు ఆ మహర్షి శిష్యునిగా స్వీకరించి  ఎంతో వినయంతో తనకు విద్యను బోధించమని  అడిగినప్పుడే అతడి పై సదభిప్రాయం కలిగింది  అనువైన చోటికి వెళ్ళు శిష్యా నీకు ఘనమైన స్థిర కీర్తి లభిస్తుంది బిడ్డ అని ఆశీర్వదించి పంపించాడు  ఆ మునివర్యుడు  ఆ గురువుగారి పాదపద్మాలకు మొక్కి  బయలుదేరి  నేపాల్ దేశానికి వెళతాను  కాశ్మీర దేశ గిరి సాలువులను చూస్తాను  ఎలా వెళ్లాలో తెలియదు  సాహసానికి మాత్రం లోటు లేదు. వెళ్లే మార్గంలో అనేక క్రూర మృగాలు  శార్దూలాలు ఖడ్గ మృగాలను దాటి  భాగమతి నదిని చేరి నారాయణుని దాటి ఖాట్మండు నగరాలలో కాలుమోపి  గండకీ నదిలో ఉన్నటువంటి సాలగ్రామ విష్ణు ప్రతిమలను  ఏరి  ఎంతో భక్తితో భక్తీదమం చేరి మోక్ష దాతలను కొలిచి ఖట్మండు పశుపతిని  కనులార చూసి  మ్రొక్కి తిరిగి ప్రయాణమయ్యాడు  చివరికి కాశ్మీర్ దేశానికి వెళ్ళాడు  అంత చిన్న వయసులోనే రాజు గారికి ఎన్ని ఎన్ని సాహసాలు ఎంత శ్రద్ధ  ఇంతకుముందు ఎవరైనా ఇంత సాహసం చేశారా అంటే  అది ఆదిశంకరాచార్యులు వారు తప్ప మరొకరు లేరు  వారి తరువాత వీరే అన్న ప్రఖ్యాతిని తెచ్చుకున్న వాడు మన అల్లూరి సీతారామరాజు.


కామెంట్‌లు