ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణివిజయవాడ కేంద్రం,9492811322
 పాత అలవాటు ప్రకారం  తప్పు అని తెలిసి కూడా ఒకరోజు ఒంటరిగా వెళ్లి  కల్లు కడుపునిండా తాగి తూలుతూ  పడుతూ లేస్తూ  వస్తున్న అతన్ని  ప్రభుత్వ బంటు ఒకడు  గమనించి అతని పేరును రాసుకుంటున్న సమయంలో  ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియకుండా ఒక బాణం  వచ్చి అతని గుండెల్లో దిగేసరికి  మరణించాడు. ఆ సమయంలో ఒకతను వచ్చి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీవు ఇది మానకపోతే రాజు గారితో చెప్పి  శిక్షిస్తానని తనను తీసుకొని వెళ్ళాడు రాజు గారి దగ్గరికి  ఎంత చెప్పినా నీవు ఈ పనులు మారడం లేదు  నీవు చేసే పనుల వల్ల మనకు చేటు కలుగుతుంది  మల్లు నీవు ఉద్యమంలో ఇమడ లేవు  నీ తప్పును నేను క్షమించలేను వెళ్ళిపొమ్మన్నాడు.
రాజుగారి పరుష వాక్కులు విన్న తర్వాత  వారి పాదాలను తాకి అన్నా నేను తప్పు చేశాను నీ మాటను మర్చిపోయి ఇంత ఘోరం చేశాను నీకు మొహం చూపడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది  ఆశయ సిద్ధి కోసం రేయింబవళ్లు   పోరాడుతున్న నీ ఆశలు పాడుచేసి  నీ చస్థితికి దిగజారాను  నన్ను ఓర్పుతో చూడమని కోరడం లేదు  ఆ ఆశల మాయలో పడి నేను చేసిన పాపాన్ని  మర్చిపోలేను  నేను చేసిన ఈ పనిని భగవంతుడు కూడా సహించదు  ఉద్యమ నీతి తప్పి చరించిన నాకు ఇది చిన్న శిక్ష మాత్రమే  అన్న మల్లు దొరతో రాజుగారు  ఉద్యమం మేలు కోరిన వాడివైతే మమ్మల్ని విడిచి వెళ్ళిపో  మాకు ఎలాంటి బాధ లేదు అనగానే ఆ మాటను ఆజ్ఞగా భావించి దుఃఖిస్తూ ఎంతో బాధతో  రాజు గారి పాదాలను అంటి తన దగ్గర ఉన్న తుపాకిని కత్తిని ఆయుధాలను  అన్నిటిని వారి పాదాలపై ఉంచాడు  అతని బాధ మదన చూసి  రాజుగారికి కళ్ళలో నీళ్లు తిరిగి  తమ్ముడా  మన చెలిమిని తలుచుకో నిన్ను ఇలా విడిచి వెళ్తున్నాను కానీ  మరుజన్మ వరకు నిన్ను మరువగలనా నేను  అంటూ దుఃఖాశ్రువులతో  కౌగిలించుకున్న తర్వాత మల్లు దొర నా తప్పుకాయండి నన్ను మన్నించండి వెళ్లి వస్తాను  అనగానే అన్న వెళ్లి పొమ్మన్నాడు కనుక వీరులు చుట్టూ చేరారు  వారందరూ చాలా బాధపడ్డారు  నేరము చేసిన వారిని వీరులు శిక్షించే పద్ధతి ఇదే కదా అనుకున్నారు అంతా  రాజు గారిని విడిచి ఏడుస్తూనే పాపం ఆ మల్లు దొరను నడిపించారు.  పాలెం  వెళ్లే దోవలో నడుచుకుంటూ  అక్కడ అతనితో ఉన్న వేశ్య ఇంటికి వెళ్ళాడు.
కామెంట్‌లు