ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 తనతో ఉన్న తన తల్లి  ఇంటిలో వండిన వంటలను తినకుండా పండ్లను  తిని పాలు త్రాగి కాలం గడుపుతూ ఉండడాన్ని గమనించిన సీతారామరాజు అమ్మా నీవు ఇలా ఉంటే  ఎలా  నన్ను ఎంతో ఆదరంతో కడుపునిండా  ఆప్యాయంగా పెట్టావు కదమ్మా  నీవెందుకు భోజనం చేయకుండా ఉన్నావు అని అడిగినప్పుడు  ఆమె కొంచెం విచారంగా కన్నా నీకు వివాహం చేయాలన్న ఆలోచన నాకు ఉన్నది  ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చేసుకుంటావు  నిన్ను వివాహం చేసుకోవడానికి అనేకమంది కన్యకామణులు ఎదురుచూస్తూ ఉన్నారు  వారి తల్లిదండ్రులు ఎన్నో పర్యాయాలు మన దగ్గరకు వచ్చారు  నీకు ఒక కన్యతో వివాహం చేస్తే నా బాధ్యత తీరుతుంది  ఏచీకు చింతకు  లోను కాకుండా జీవితాన్ని గడుపుతాను అంది తల్లి

అమ్మ నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు  వివాహం చేసుకొని సుఖమయ జీవితాన్ని గడపడానికి  ఇంత దూరం వచ్చి ఇన్ని కార్యాలు చేయడానికి  ఉపక్రమిస్తానా  మానసికంగా నేను సన్యాసిని అన్న విషయం నీకు తెలుసు కదా అమ్మ సన్యాసులు ఎక్కడైనా వివాహం చేసుకుంటారా నీవే ఆలోచించు  అన్న కొడుకు మాటలకు తన మనసు నిండా ముళ్ళు  గుచ్చుకున్నట్లు బాధపడుతూ  కన్న కలలన్నీ కలలై తూలి పడిపోయింది నేలమీద  అడవిలో చెట్టులా పడిపోతే ఎలా ఉంటుందో అలా  తల్లి గొప్ప కార్యాలు చేసి సేద తీర్చి  అమ్మ చింత పడకు నా తమ్ముడు నీ చిన్న కుమారుడు ఉండగా నీకు లోటు రానిస్తానా  వాడి సంసారాలు చూసి ఆనందపడవచ్చు కదమ్మా అని  ప్రాధేయ  పడ్డాడు.ఫజులుల్లా ఖాన్ అక్కడి శాంతి అధికారి మనసున్న వాడు మంచివాడు  డిప్యూటీ కలెక్టర్ గా వచ్చి దీనులను కరుణించి సేవ చేయాలన్న మనసుతో ఉన్నవాడు  అల్లూరి పెద తండ్రికి అతను చాలా దగ్గరి స్నేహితుడు  ఒక పర్యాయం రాజుని పిలిపించి ప్రేమతో మాట్లాడుతూ హస్తరేఖలను అన్నిటినీ చూసి పరిపాలకుల నీతిమాలిన పనులకు చింతించి రాజుకు వంత పాడాడు నీవు పితూరీ చేస్తావని విన్నాను నాకు నిజాన్ని చెప్పు అనగానే రాజు  మీరు మన్యంలో ఉన్నంతవరకు నేను ఆ పని చేయబోను అని ఖాన్ గారికి చెప్పిఅతని జాతకం ప్రకారం  ఖాన్ గారు  మీకు 10 నెలలు ఆయుషు మాత్రమే ఉన్నది  హాయిగా ఇంటి పనుల  చేయించుకో అని సలహా ఇచ్చాడు.



కామెంట్‌లు