అమ్మ భాష తెలుగు అమృతమ్ము;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ భాషే అమృతము
అన్ని భాషలందు ఘనము
అందమైన నుడికారము
అమోఘమైన  పదజాలము

అక్షరాలు సింగారము
అణువణువునా బంగారము
అమ్మ భాష తెలుగు వెలుగు
అనుకరిస్తే జయం కలుగు

అవనిలో అమూల్యమైన
రాయలు కొనియాడినట్టి
అపురూపమైన ఘన తెలుగు
అనిశమ్ము మన గుండె శ్వాస

అవహేళన చేయొద్దోయ్!
పర భాషల మోజులోన
అమ్మ భాష మరువద్దోయ్!
అజేయమైనది మహిలోన


కామెంట్‌లు