ఈర్ష్య ప్రమాదకారి;- -గద్వాల సోమన్న,9966414580
ఈర్ష్య హద్దు మీరితే
తెచ్చిపెట్టు ప్రమాదం
మరీచికలు బ్రతుకుల్లో
ఉండదోయి! ప్రమోదం

పొరుగువారి ఎదుగుదల
ఏమాత్రం ఓర్చుకోదు
మనసున  ప్రశాంతంగా
కుదురుగా ఉండనివ్వదు

ఈర్ష్య వలన ఆరోగ్యం
అడుగంటిపోతుందోయ్!
మానసిక స్థితిగతులు
అతలాకుతలమవుతోందోయ్!

మరణమంత భీకరం
చూడంగా ఈర్ష్య కదా!
ముప్పుతెచ్చిపెట్టునోయ్!
నరకం చూపించు సదా!


కామెంట్‌లు