విసర్గ అక్షర పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
అంతఃపురం సుందరము
అదే రాణీ వాసము
స్త్రీలకు మాత్రం ప్రవేశము
ఇతరులకేమో నిషిద్ధము

ప్రాతఃకాలము ప్రశాంతము
ప్రార్థన, పూజలకనుకూలము
మనసుకు దొరుకు నెమ్మది
నిలువును దైవ సన్నిధి

అంతఃకలహాలు వద్దు వద్దు
అందరు కలిసుంటే ముద్దు ముద్దు
చేయి చేయి కలిస్తే చప్పట్లు
తొలగిపోవును పలు ఇక్కట్లు

తపఃఫలం గొప్పది గొప్పది
అధఃకారం చెడ్డది చెడ్డది
దురాశ దుఃఖానికి చేటు చేటు
మానవత్వమే చాటు చాటు


కామెంట్‌లు