అపురూపం పసి పిల్లలు;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ ఒడిలో పిల్లలు
అందాలొలికే మల్లెలు
ఆకాశంలో చుక్కలు
అవనితలంలో మొక్కలు

అభివృద్ధికి వారు బాటలు
ఆనందమిచ్చే తోటలు
అమృతమ్ము వంటి ఊటలు
అనురాగాల మూటలు

అలరించే చిన్నారులు
అందరికీ స్నేహితులు
అభిమానం చూపించిన
అల్లుకొను పూల తీగలు

అపురూపం పసి కూనలు
అద్భుతం వారి పలుకులు
ఆలోచనలు పరికింపగ
అబ్బురం,శంపాలతలు


కామెంట్‌లు