అప్పు పెనుముప్పు;- -గద్వాల సోమన్న,9966414580
అప్పు చూడ ముప్పురా!
అంటుకున్న వదలదురా!
అంతం చూసేదాకా!
అనిశం వెంటపడునురా!

అప్పు మహా ఊబిరా!
అదోపాతాళమదేరా!
అడ్డుగోలుగా పెరిగి
అసువులు తీసేయునురా !

అశాంతికది మూలమురా!
అవమానానికి త్రోవరా!
అప్రతిష్ట పాలుచేసి
అవహేళన చేయునురా!

అప్పు యమపాశమురా!
అగ్గిలా తగలబెట్టురా!
ఆరునూరైనా సరే
అటువైపు వెళ్లకురా!


కామెంట్‌లు