సంక్రాంతి పర్వదినం;- -గద్వాల సోమన్న,9966414580
సంక్రాంతి వచ్చింది
సంబరం తెచ్చింది
రైతన్న కళ్ళలో
సంతసం మెరిసింది

ఇంటి ముందు ముగ్గులు
వాటిపై గొబ్బెమ్మలు
అలరించు అందాలు
ఉప్పొంగు హృదయాలు

పిల్లాపాపలతో
ఇల్లంతా కళకళ
ఆడపడుచులతో
నవ్వులతో కిలకిల

ఒకవైపు కోడి పందాలు
మరోవైపు చలి మంటలు
గంగిరెద్దుల కోలాహలం
హరిదాసుల సంచారం

భారతీయ సంస్కృతికి
నిదర్శనం సంక్రాంతి
మూడు రోజుల పండుగ
తెచ్చునోయ్! మనశ్శాంతి


కామెంట్‌లు