ద్విత్వాక్షర పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
అల్లరి చేయుట
పిల్లల సొంతము
తెల్లని  రంగే
మల్లెలకు వరము 

సుద్దులు చెప్పుట
బుద్ధులు దిద్దుట
పెద్దల బాధ్యత
హద్దున ఉంచుట

భువిలో మొక్కలు
దివిలో చుక్కలు
అందము! అందము!!
గృహమున అక్కలు


పాపల బుగ్గలు
తామర మొగ్గలు
ముంగిట ముగ్గులు
బాలల సిగ్గులు


కామెంట్‌లు