విఠల్ పంత్ రెండో కొడుకు ఇతను మరాఠీలో గొప్ప అభంగాలు రాసిన పాండు రంగ భక్తుడు.అమ్మనాన్నలు లేని అనాథలుగా నల్గురు పిల్లలు యాచన చేస్తూ బతికారు.ఉపనయనం చేయమని పురోహితులు నిరాకరించారు.అప్పుడు జ్ఞాన దేవుడిలా అన్నాడు" నాకు చైతన్య స్వరూపం తెలుసు." తమ్ముడు సోపాన్ అన్నాడు " అందరిలో భక్తి బీజాలు నాటే సోపానం మెట్టుగా ఉంటాను" ఆఖరి పిల్ల" నాపేరు ముక్తాబాయి.అందరికీ ముక్తి ద్వారం తెరిచే పనినాది". ఆపిల్లల మాటలకు కోపం రోషంతో" మీ అమ్మ నాన్నలు భ్రష్టులైనారు.మీరు దున్నపోతు లతో సమానం" అని ఎద్దేవా చేశారు పురోహితులు. జ్ఞానదేవ్ దాన్ని సవాలుగా తీసుకొని"ఆదున్నపోతు చేత వేదమంత్రాలు చెప్పిస్తాను" అని దాని తలపై చేయి పెట్టగానే అది మంత్రోచ్చారణ చేయడంతో పురోహితులు సిగ్గు పడ్డారు.వారికి ఉపనయనం చేశారు.ఒకసారి ముక్తాబాయి మట్టిపెనం కొంటే ఒక అహంకారి ఆపిల్లచేతిలోది లాక్కుని ఢాంఅని పగులగొట్టాడు.చెల్లిని ఓదార్చి" ముక్తా! నా వీపు పై రొట్టెలు కాల్చు " అనటం అతని వేడి వీపు పై ఆమె రొట్టెలు చేయడం ఓఅద్భుతం.యోగి కావాలంటే ఏదైనా సాధించవచ్చు.కానీ భక్తులు ఆపిల్లలు.!! ఓసారి అతన్ని ఎవరో తిడితే ముక్తాబాయి ద్వారకీర్తన అనే తటీవే అభంగ పాడి స్వయంగా ఆశువుగా చదివి ఊరడించింది." " ఇతరుల క్షమించడం శాంతంగా ఉండటం సాధు లక్షణం." ఈమె కేవలం18 ఏళ్ళు బ్రతికింది. అలాగే ఒక బ్రాహ్మణుడు పితృతద్దినానికి ఈపిల్లలని భోజనానికి ఆహ్వానించాడు.వారిని చూస్తూనే అక్కడున్న వారు" ఈభ్రష్ఠులతో కల్సి మేం అన్నం తినం" అని బైటికివెళ్ళిపోయారు. జ్ఞాన దేవ్ పితృ దేవతలను ఆహ్వానించాడు.వారుఆరగించి వెళ్లి పోవడం చూసిన అంతా ఆపిల్లలకు మొక్కారు
సంత్ జ్ఞాన దేవ్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి