* తీపి జ్ఞాపకాలు *;- కోరాడ నరసింహా రావు
  గత మెంతో ఘన0...! 
 ఇది నిజమె ... అనిపిస్తోంది!! 
  అప్పట్లో పండుగలంటే ఎంత సందడి ...! 
  సంక్రా0తి ,అంటె... ఎంత సం దడిగా  జరిగేది...! 
  పది రోజుల ముందు నుండే
 పిల్లల మందరమ్కలిసి ఇంటింటికీ వెళ్లి ... 
 "భోగి కర్ర, పొయ్యిలోకర్ర, ఇస్తే పుణ్యం, ఇవ్వకుంటే పాప0 "
అంటూ కర్రలు దండటం ! 
   చీకటి పడితే చాలు... విరిగి మూలన పడేసిన కర్ర మంచాలు , బీరువాలు, తలుపులు లాంటివి తస్క రిం చే యటమే...! 
  భోగి ముందు రోజు రాత్రి మేమంతా నిద్దర పోతేగా!! 
  రాత్రి ఒంటి గంట దాటేవరకు
ఆటలు - పాటలు...! 
  మాతో... ఉత్సా హ వంతులై న కొందరు పెద్దలూ కలవటం... 
   వాల ఇంట్లో ఆడ వాల్లని పిలవట0..., 
  వాల్లు వీధి మధ్య లో చక్కగా
కల్లాపి చల్లి అందమైన పెద్ద ముగ్గు... 
  ఆ మధ్యలో మేము సేకరించి న కర్రలు, అక్కడక్కడ ఎండిపోయిన చెట్లను కొట్టిన వాటితో సహా మొత్తం అన్నీ ... 
నిలువుగా అందముగాపేర్చి 
 కర్పూరం వెలిగించి ఆ క ర్ర ల
 మధ్య ఉంచే సరికి అది భగ- భగా మండుతుంటే... 
   మా కేరింతలు తుళ్లి0తలకు
 హద్దు లెక్కడ...!? 
  వేకువనే... మా అమ్మలు... కడవలతో , తపేలా లతో... 
భోగి మంట దగ్గర నీల్లు మరగ బెట్టి 
   ఆ వేడి వేడి నీల్ల తో నలుగు లు పెట్టిన మాకు తలస్నానాలు
చేయించి రేవు బట్టలు వేయించి,  భోగి పిదకల దండలు భోగి వేయించి...వేడి - వేడిఇడ్లీలు,కుడుములు...రుచికరమైనచెనగపలుకులచట్నీతో..అబ్బ... ఆ మజాయే వేరబ్బా! 
రెండవ రోజు... పెద్దల పండు గట...! 
  ఆరోజు ... చనిపోయిన మా పెద్దలందరినీ తలచుకుని... 
 ప్రతి ఇంటి లోనూ పొత్తర్ లు
ఇవ్వటమో , ఉపారాలు తీసి, కొత్త బట్టలు పెట్టటమొ..., ముత్తైదువు లకు పసుపులు పొయ్యాటమొ... 
  వీధులన్ని స0దడే..! హడా
వుడే...!! 
   పండగ  మూడో రోజు.... 
పసువుల పండుగ... కనుమ! 
 వ్యవసాయం లో సహక రించిన పసువులకు పూజలు చేసి, రైతులు కృతజ్ఞతనుచా టు కుంటారు...! 
 ఎన్ని కోలు, గొర్రెలు....ఎ న్నేన్ని
జీవాలు బలై పోతాయో..! 
  తాగుబోతులు తాగటంలో... 
 జూదగుండులు జూదం లో
  మునిగిపోతే..., 
మాలాంటి వాల మ0తా... 
 విందులు, వినోదాలు, కొత్తబట్టలు... గాలి పత0గు
లు... ఆటలు పాటలతోను, ఎడ్ల పందాలు  కోడి పందాలుచూడటం తోనూ స0ద డే... సందడి...!! 
 ఈ భోగి ఉత్సాహాలు, ఉల్లా సాలు బాగా తగ్గిపోయినా... 
 ఇంకా... మా లాంటి చిన్న-చి న్న ఊరు ల్లో కాస్తో కూస్తో మిగిలే ఉంది...! 
    అందుకే.. సంక్రా0తి వచ్చిం దంటే... ఎక్కడేక్క డో ఉద్యో గాలు చేసు కుంటున్నవా రం తా... వచ్చేస్తారు...! 
 ఇప్పుడు ఇవన్నీమాకు నెమరు వేసు కునే తీపి జ్ఞాపకా లు...!! 
     ********

కామెంట్‌లు