: గోపబాల!; వరలక్ష్మి యనమండ్ర- అద్దంకి, బాపట్ల జిల్లా
 01
నల్లనయ్యవయ్యననుగన్నవాడవే
తెల్లమనసు నీవు దేవుడీవె!
యెల్లలోకములను చల్లంగజూచేవు
కొలుతునయ్య నిన్ను గోపబాల!
02
సిగన పింఛమలరె చేతిలోన మురళి
మెడన పూల దండ మేలిఛాయ!
నోటి వెన్న ముద్ద నుదటన కస్తూరి
కొలుతునయ్య నిన్ను గోపబాల!
03
భక్తపాలకుడవు భవ్యచరితుడవు
వెన్నవంటిమనసు చిన్నికృష్ణ!
ధన్యమయ్యననుచు తల్లాయెను యశోద
కొలుతునయ్య నిన్ను గోపబాల!
04
చెలులతోడనాడు సిఖిపింఛధారుడా
వరములొసగుమయ్య భక్తులకును!
గెలుపు చూపునట్టి గీతగోవిందుడా
కొలుతునయ్య నిన్ను గోపబాల!
05
రోటగట్టి నిన్ను రోదించగ యశోద
మద్ది చెట్ల మధ్య గుద్దినావు!
శాపములను బాపి చూపేవుదారిని
కొలుతునయ్య నిన్ను గోపబాల!

కామెంట్‌లు