141)బ్రాజిష్ణుః -
అద్వయ ప్రకాశరూపం గలవాడు
బ్రహ్మాండాన భాసిల్లువాడు
విష్ణుస్థానము నందున్నవాడు
అంతయు వెలుగుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
142)భోజనః -
భోజ్యరూపము అయినట్టివాడు
ఆహారమునందు ఉన్నవాడు
ప్రాణుల ఆకలి తీర్చుచున్నవాడు
కుక్షిని నింపుశక్తియున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
143)భోక్తాః -
ప్రకృతి ఆస్వాదన చేయువాడు
సర్వమును అనుభవించువాడు
సర్వభోక్తగా నిలిచియున్నవాడు
సంపూర్ణ అనుభవదారుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
144)సహిష్ణుః -
అపరాధములు మన్నించువాడు
భక్తుల క్షమించుచున్నవాడు
అన్నిస్థితులనూ సహించువాడు
సంయమనము గలిగినవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
145)జగదాదిజః -
సృష్టి ఆరంభముకు కారకుడు
ఆదినుండియు వున్నట్టివాడు
ఆరంభమున వ్యక్తమైనవాడు
మూలకారణము తానయినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి