సౌందర్యలహరి; - కొప్పరపు తాయారు
  🌻 శ్రీ శంకరాచార్య విరచిత 🌻

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః ।
ప్రణామస్సంవేశస్సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ ॥ 27 ॥

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః ।
కరాలం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవా  జనని తాటంకమహిమా ॥ 28 ॥

,27), ఓ జగన్మాతా! భగవతీ! నీ పాదముల చెంత   ఆత్మార్పణ భావముతో నేను చేయు సంభాషణ _
ఓ మంత్రజపముగానూ_ నా హస్త విన్యాసమంత
యూ_నీ ముద్రారచనగానూ_నేను ఎక్కడ తిరిగినా
అది నీకు చేసిన ప్రదక్షిణ గానూ_ నా భోజనాదులు_
నీకు యజ్ఞంలో సమర్పించు
ఆహూతులుగానూ,_నేను పరుండుట_నీకు  చేసే
సాష్టాంగ దండ ప్రణామంగానూ,_ఈవిధంగా ప్రతి క్షణము నేను చేసే ప్రతి పనీ, నీకు చేసే సంపూర్ణ
మైనా,సంతోషదాయక మైన పూజగా అగు గాక !
28) తల్లీ ! జగన్మాతా! బ్రహ్మ ఇంద్రుడు,మున్నగు 
దేవతలందరూ, జరా మృత్యువులను జయించే
అమృతమును తాగినవారై ఉండి కూడా ప్రళయ కాలం వచ్చినప్పుడు మరణిస్తున్నారు.
 లోకములను దహించే కాలకూటవిషమనే మహావిషమునుమ్రింగి_నీలకంఠుడిగా మారిన  నీ పతి అయినా శంభుడు మాత్రం ప్రళయకాలము నందు కూడా మరణించక చిరంజీవియై ఉన్నాడు. అందుకు ముఖ్య కారణం నీ చెవుల యందు బాసిల్లుచున్న మంగళకరమైన నీ తాటంకములు(చెవి
కమ్మలు) ప్రభావమే!!!
                     ,🪷***🪷***🪷
తాయారు 🪷

కామెంట్‌లు