అవ్యక్తాచార్యుడా;- పెందోట వెంకటేశ్వర్లు,సిద్దిపేట
పంచ కట్టి లాల్చి వేశాడు 
రుమాలు చుట్టి నిలిచాడు 
సంక్రాంతి పండగొచ్చెనని 
సకినాలు, గారెలు, మౌడూలు,
అరిసెలు, నూల ముద్దలు,
చెరుకు గడలు, చామంతులు
బొమ్మలతో ఆటలు 
చూసేవారికి విందులు 
అమ్మతోనే ఆటలు 
రెండు నెలల చూపులు 
పట్టినావా పతంగులు 
ఎగరేయ్ ఆనందాలు 
ప్రసన్న వదనా కార్తీక తనయా
పెందోట అవ్యక్తాచార్యుడా 
సంక్రాంతి శోభలకే వన్నెలు 
సింహ్మరాజు మనవడా 


కామెంట్‌లు