కవి _కలం కవి సమ్మేళనం

 ప్రముఖ సంగీత దర్శకులు, సినీ దర్శకులు, లిరిక్ రైటర్ ,నటులు,
కలం స్నేహం సాహిత్య సమాజ సామాజిక ,సంగీత ,అనుబంధ సంస్థల వ్యవస్థాపకులు అయినా శ్రీమన్ గోపాల్ ఆచార్య గారి పర్యవేక్షణ లో కలం స్నేహం జాతీయ ప్రధాన కార్యదర్శిడాక్టర్ రాధా కుసుమగారి అధ్యక్షతన కలం స్నేహం 2 సభ్యులతో  కవి _కలం అనే అంశంతో కవి సమ్మేళనం  నిర్వహింపబడినది.
"నభూతోన భవిష్యతి" అన్నట్లుగా రూపొందించబడిన
        ఈ కవి సమ్మేళనానికి కలం స్నేహం ప్రధాన కార్యదర్శి, మేలుకొలుపుల స్వరరాగ కోకిల, 200కు పైగా కవి సమ్మేళనంలను   దిగ్విజయంగా నిర్వహిస్తూ , స్ఫూర్తిదాయక మహిళగా,  సభాసమన్వయ వాచస్పతిగా  
పెద్దల ,ప్రముఖకవుల ప్రశంసలను అందుకుంటున్న స్నేహశీలి  డాక్టర్ రాధాకుసుమ గారు ఈ కవి సమ్మేళన  వేదికకు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. త్యాగరాయ గాన సభ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ సమావేశం నిర్వహించబడినది.
ఈ కవి సమ్మేళనమునకు , తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు, కర్ణాటక, మొదలగు రాష్ట్రాల నుండి కవులు దూర భారమైన లెక్కచేయకుండా పాల్గొనడం విశేషం.
 ఈ సమావేశానికి  IPS రావుల గిరిధర్ గారు  ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కవులు సమాజంలోని  లోటుపాట్లను తీర్చిదిద్దుటకు వారి కలాన్ని ఉపయోగించాలని తెలియజేస్తూ  నేటి యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుట కు , కవులు స్ఫూర్తిదాయకమైన రచనలను చేపట్టాలని తెలియజేస్తూ కవులందరికి అభినందనలను తెలియజేశారు.  
కవుల అంతరంగంలో పురుడు పోసుకున్న భావజాలం అక్షరాల ప్రవాహమై కవితా కావ్య కన్య కల రూపంలో   సభా వేదికపై  నృత్యంచేశాయి.
ఆత్మీయత మధురిమలను పంచే కవితలు కొన్నైతే, సమాజంలోని సమాజంలో చైతన్య స్ఫూర్తిని కలిగించే కవితలు కొన్ని అన్ని కోణాలను స్పృశిస్తూ కవుల కలం నుండి జాలువారిన కవితలతో సభా ప్రాంగణం  పులకించిపోయింది.
దీనికి సుమధుర భాషిని డాక్టర్ రాధాకుసుమగారి వ్యాఖ్యానం మరింత శోభను చేకూర్చింది.
కేవలం కవితలే కాకుండా సంగీతానికి ప్రాధాన్యతను ఇస్తూ నోరి రఘురామమూర్తి హేమ దంపతులు చక్కని యుగళగీతాలను ఆలపించారు.
 వేదికపై కవులకు  ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్యులు గారు కవులు  కవితా రచనేని కాక సామాజిక దృష్టి సేవా దృక్పథం కూడా కలిగి ఉండాలని అందుకు కలం స్నేహం కృషి చేస్తుందని తెలియజేస్తూ కవులందరికి అభినందనలు తెలియజేశారు.
 
ఈ కవి సమ్మేళనమునకు
కవి సమ్మేళనం కు కలంస్నేహం గౌరవ అధ్యక్షురాలు లయన్ అరుణ కుమారిగారు 
ఆర్. ప్రవీణ్ గారు,దూత రామకోటేశ్వరరావు గారు, కాదంబరి కృష్ణ ప్రసాద్‌ గారు ,
ఎం.వి.చంద్రశేఖర రావు గారు ,చిట్టాబత్తినవీరరాఘవులు గారు ,జె.వి కుమార్ చేపూరి గారు,భీమ శ్రీనివాస్ రావు గారు, దేవులపల్లి రమేశ్ , గారు,అయ్యల సోమయాజులు గారు,నాయకంటి నరసింహ శర్మ గారు, వెంకటేశ్వర్లు లింగుట్ల గారు,కాటేగారు పాండురంగ విఠల్ గారు,కె.వి ప్రభాకర్ రావు గారు, పోలయ్య గారు,దీపక్. గారు ,N R మూర్తి గారు,ఎమ్ లోకనాథం గారు,
రాజేంద్రప్రసాద్ జి. గారు,రవీంద్రబాబు గారు,గజ్జెల శ్రీనివాసులు, గారు,అబ్దుల్‌షాహిద్ గారు,
జి జి రావు గారు,గాడే పల్లి మల్లికార్జునుడుగారు ,అంజయ్య దాస్ గారు ,
అరవ జయపాల్ గారు,షేక్ రహీమ్ సాహెబ్ గారు ,రామకృష్ణ చంద్రమౌళి గారు, మహేష్ వూటుకూరి గారు ,జగ్గయ్య జి గారు, గురున్నాధం ఎమ్ గారు, రాహుల్ ఇంద్రావత్ గారు, గుళ్ళపల్లి ఆంజనేయులు గారు ,డాక్టర్ ఎమ్ నాగేశ్వరరావు గారు ,మోటూరి నారాయణ రావు గారు ,సంపంగి నర్సింహులు, గారు ,.శరత్కవిగారు ,కనకయ్య గారు ,మధు జెల్ల గారు ,జగ్గన్నగారి శ్రీనివాస్ రావు,అక్కి నర్సింహులు గౌడ్,
కర్నాటి రఘురాములు ,గౌడ్ భీమేష్ మొదలగు కవి మిత్రులు పాల్గొని సభను సుసంపన్నం చేశారు.

కామెంట్‌లు