🪷సౌందర్యలహరి🪷; - కొప్పరపు తాయారు
🌻 శ్రీ శంకరవిరచిత🌻

చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః ।
చతుశ్చత్వారింశద్వసుదలకలాశ్రత్రివలయ-
త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః ॥ 11 ॥

త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించిప్రభృతయః ।
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్ ॥ 12 ॥

11) అమ్మా! నాలుగు శివచక్రాలతో, అయిదు శక్తి చక్రాలతో అష్టదళ షోడశదళ త్రీ వలయ త్రి రేకులతో
అత్యంత శోభాయమానంగా అత్యంత సౌష్టవ రీతిలో బ్రహ్మాండ పిండాండ సృష్టి ప్రళయ విజ్ఞాన
సమస్త రహస్యాలను సంకేతపూర్వకంగా పొందుపరచబడిన యంత్ర రాజమే ఈ శ్రీ చక్రం , సమస్త  విజ్ఞానము ఇందులోని ఇమిడి ఉన్నందువలన, దీన్ని మించిన యంత్రమే లేదుగా!
ఇలా నలుబది నాలుగు అంచులు గల శ్రీ చక్రమే నీకు నిలయము కదా తల్లీ !

12) అమ్మా! నీ సౌందర్య సందర్శనం ఎటువంటిది అంటే ఓ హిమాద్రి సుతా ! అత్యంత శ్రమించి చతుర్ముఖ అని కవి పుంగవులు మీ సౌందర్య సందర్శనసామ్యానికై కల్పలనుచేస్తున్నారు తపస్సు చేస్తున్నారు. కానీ అవి చాలడం లేదు. తపస్సు వల్ల సాధ్యం కానీ శివ సాయుధ్యాన్ని 
అప్సరాంగనలు మానసిక భావన చేస్తున్నారు అయినప్పటికి భవదీయ సౌందర్య సందర్శన మాత్రాన తాము నీకంటే చాలా తక్కువ  అనుకుంటున్నారు కదా తల్లీ!
****🪷*****
    తాయారు 🪷

కామెంట్‌లు