నువ్వు నన్ను ఎప్పటి వరకూ ఆపగలవు?;- చంద్రకళ యలమర్తి
పిడికిలిలో కొన్ని స్వప్నాలు
జేబులో కొన్ని కోరికలు దాచుకు..న్నా..
నామనస్సులోని ఆశ ఒక్కటే
ఏదో చెయ్యాలని,ఏదోచేసిపోవాల ని

సూర్యుని వంటి తేజస్సు నాలో లేదు
కాని నాలో జ్వలించే దీపశిఖని చూడగలవు

నాశక్తి సామర్ధ్యాలు నాకు తెలుసు
నువ్వు నన్ను ఎన్నాళ్ళు ఆపగలవు?

నేను ఆ మట్టిలో పెరిగిన వృక్షాన్ని కాదు
నదులలో నీరు తాగి పెరగలేదు
నేను బీడు భూమిలో పుట్టాను
చావునుండి ప్రాణాన్ని తెచ్చుకున్నాను

నేను శిలపై వ్రాయబడ్డాను 
గాజుతో నన్ను పగల
గొట్టలేవు
నా పేరునువ్వు చెరపలేవు
ఎన్నాళ్ళు నన్ను నువ్వు ఆపగలవు?

ఈలోకంలో అంతఅన్యాయం
లేదంటాను
నాలో అంతకన్నా ఎక్కువ సహనం వుంది కనుక
వెక్కిరింతలు,సవాళ్ళ మధ్య
కూడా 
నిజాన్ని చెప్పగలధైర్యం నాకు వుంది

నామనస్సు సముద్రం కంటే లోతైనది
నువ్వు నాపై ఎన్ని రాళ్ళు
రువ్వినా
నేను అంతే జాగ్రత్తగా ముంద
డుగేస్తుంటాను
నువ్వు నన్ను ఎప్పటివరకూ ఆపగలవు?

అడుగడుగునా అగ్ని పరీక్షల్ని నెగ్గి నిలవ
గలిగాను 
ఇంక  నన్ను పరీక్షించాలానుకోవడం అవివేకం 

నాజీవితాన్ని నేనే తీర్చి దిద్దు
కున్నాను
నీచేతిలో తుడుచుకు పోతుం
దన్న భయంలేదు

పరిస్థితుల కొలిమిలో ఎప్పు
డెప్పుడు నన్ను కాల్చాలనుకున్నా,

ప్రతిసారి వన్నె పెరిగిన మేలిమి బంగారమౌతుంటాను

నువ్వు ఎప్పటి వరకు ఆప
గలవు
నువ్వు నన్ను ఎప్పటి వరకూ ఆవగలవు?
**
ప్రముఖ హిందీ కవితకు నా అనువాదం 🙏
కామెంట్‌లు