కుదమలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

 కుదమ గ్రామంలో సంక్రాంతి సంబరాల కమిటీ ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. 
శ్రీరామమందిరంపై నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు, బాలబాలికలకు బాస్కెట్ లో బాల్ పోటీలు, స్లో సైకిల్ డ్రైవింగ్ పోటీలు, క్విజ్ పోటీలు, హౌసీ, స్పూన్ లెమన్, గోనెలో కాళ్ళుంచే పరుగుపోటీలు మున్నగునవి నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలు, విద్యార్ధులు, బాలలు, పెద్దలైన రెండు వందలమందికి బహుమతులను అందజేసారు. గ్రామపెద్దలు, యువకులు ఈ కార్యక్రమాలను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించారు. 
ప్రతీ పోటీనందు రెండువందల మంది పాల్గొని అత్యంత వైభవంగా రంజింపజేసారు. 
గాలిపటాల ఎగురవేత, ఆటా పాటా కార్యక్రమాలతో బంధుమిత్రులంతా మిక్కిలి సంబరాలను ఆస్వాదించారు. 
గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యావంతులు ఈ సంక్రాంతి సంబరాల ముగింపు సభలో బహుమతి ప్రధానాలు గావించి, ప్రసంగించారు.
అందరికీ దైవప్రసాదాలను, మిఠాయిలను పంచిపెట్టారు.
కామెంట్‌లు