భూదేవి పాటతో తిరుమలరావుకు సత్కారం

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు సాంస్కృతిక విభాగంలో పాల్గొని సత్కారం పొందారు. 
ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ గౌరవాన్ని స్వీకరించారు. 
రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ జనరల్ డి.దేవానందరెడ్డి గారిచే ప్రారంభమైన ఈ సాంఘిక శాస్త్ర విద్యా వైజ్ఞానిక సదస్సులో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో తిరుమలరావు ఆలపించిన భూమి ఎక్కడున్నది భూమి ఎక్కడున్నది సూర్యుని చుట్టూ తిరుగుతున్నదీ అనే పాట సభికులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం తిరుమలరావు ప్రతిభను అభినందిస్తూ 
ఎ పి ఎస్ ఎస్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె ఎస్ వి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు యామక వెంకట రమణ, గౌరవాధ్యక్షులు టి.కేశవరావు, ప్రధాన కార్యదర్శి బాడాన రాజు, కోశాధికారి మక్క శ్రీనివాసరావు, మహిళాధ్యక్షురాలు ఎ.రాములమ్మ, సహాధ్యక్షులు కె.రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.వైకుంఠ రావు, గౌరవ సలహాదారులు ఎల్.గుణశేఖర్, అకడమిక్ కమిటీ కన్వీనర్ ఎస్.రమణ, సాంకేతిక కమిటీ కన్వీనర్ జి.అప్పలనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేష్, రాష్ట్ర శాఖ ప్రతినిధులు ఎన్.శేఖర్, జి.మురళీమోహన్, ఎస్.రాంబాబు, కరిమి రాజేశ్వరరావు తదితరులు  మెడిల్, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు. 
రాష్ట్ర అధికారి డి.దేవానందరెడ్డి, 
జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు, ఉపవిద్యాశాఖాధికారులు ఆర్.విజయకుమారి, జి.పగడాలమ్మ, వమరవల్లి డైట్ ప్రిన్సిపాల్ ఎస్.తిరుమలచైతన్య, డిసిఇబి సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూర్య చంద్ర తదితరులు పాల్గొన్న వేదికపై తనను సత్కరించిన ఎ పి ఎస్ ఎస్ టి ఎఫ్ నిర్వాహక బృందానికి తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు