136)కృతాకృతః -
కార్యకారణం తెలియజేయువాడు
తగినట్టిరూపంలో నున్నవాడు
కృతకృత్యుడగుచున్నవాడు
కార్యమున భాసిల్లుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
137)చతురాత్మా-
విభూతి చతుష్టయముగలవాడు
ఆత్మకు ధీరతనొసంగువాడు
చాతుర్యము చూపించువాడు
విభూతి పూర్వరూపమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
138)చతుర్వ్యూహాః -
నాలుగువ్యూహములు రచించువాడు
సృష్టి కార్యక్రమం చేయుచున్నవాడు
వ్యూహాత్మక భావన చేయువాడు
క్రమశిక్షణము కల్గియున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
139)చతుర్ దoష్ట్రః -
నాలుగు కోరలున్నట్టి వాడు
నారసింహావతారమైనవాడు
కోరపండ్లు గలిగినట్టివాడు
వరాహ రూపమెత్తినవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
140)చతుర్భుజః -
నాలుగు భుజములుగలవాడు
చాతుర్యము చూపించువాడు
ధైర్యమును ప్రసాదించువాడు
అభయమివ్వగల సమర్థుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి