శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
96)అజిః -

జన్మములు లేకుండువాడు
ఆటంకము తొలగించే వాడు
అడ్డంకులను అధిగమించువాడు
ఆత్మనిర్భయము గలిగించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
97)సర్వేశ్వరః -

ఈశ్వరులకే ఈశ్వరుడైనవాడు
లేడన్నవార్నీ అనుగ్రహించువాడు
ప్రభువులకు ప్రభువైనవాడు
స్వామి సర్వమునకు ఈశుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
98)సిద్ధిః -

సాధనా ఫలములకారకుడు 
సర్వకార్యము తానైనవాడు
నిధి వలే దొరికియున్నవాడు
నిత్యము అనుగ్రహపూరితుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
99)సిద్ధః -

సమస్త సిద్ధులు పొందినవాడు
భక్తులకoదుబాటులోనున్నవాడు
లోపములు లేనట్టివాడు
పరిపూర్ణ రూపముగలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
100)సర్వాదిః -

సర్వముకు మూలమైనట్టి వాడు
ఆదిపురుషోత్తముడైనవాడు
అంతముఎరుగని వాడు
ఆదిమూలమైన పరంధాముడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు