కోరాడ భక్తి గీతాలు...!

  " యుగ- యుగ మన...... "
     *******
పల్లవి :-
యుగ- యుగమున నీవు.... 
  యుగ పురుషుని వై అవతరించి నావు.... శ్రీ హరీ  నీ మహిమ , వర్ణించగ నా తరమా.. 2
        " యుగ - యుగ మున.. "
చరణం :-
   ఆదిగ,మత్స్య, కూర్మ , వరాహములై  వచ్చి.... పిదప
 వామన,  భార్గవ రాములుగా
 ఇలపై అవతరించితివి...! 
  శ్రీ హరీ  నీ మహిమ వర్ణించగ
   నా తరమా....!! 
     " యుగ  -  యుగ మున... "
 చరణం:-
     త్రే తాయుగమునశ్రీ రాముని గా.... 
  ద్వాపరమందున శ్రీ కృష్ణునివై
 ధర్మము నిల నిలిపి నావయా
      ఈ కలి యుగమున కల్కి వై...వచ్చెద నని మాటిచ్చితివి ! 
  యిచ్చిన మాటను తప్పని
  సత్య వాక్పరి పాలకుడ వీవు
 తప్పక నీవు వచ్చెదవు... 
  ధర్మమును రక్షించెదవు...!! 
   శ్రీ హరీ నీ మహిమ వర్ణిం చగ
  నా తరమా...!!... 3
          ******
కామెంట్‌లు