శ్రీ విష్ణు సహస్రనామాలు -(బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
86)సురేశః -

సకల దేవతలకు దేవుడు
దేవాధిదేవుడయినవాడు
కోర్కెలదీర్చువారిలో అధిపుడు
ఆదిదేవుడు అయినట్టివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
87)శరణం -

శరణుజొచ్చిన రక్షించువాడు
అభయమును కలిగించువాడు
ఆర్తత్రాణ పరాయణుడు
ముక్తులనివాసమైన వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
88)శర్మః -

సచ్చిదానంద స్వరూపుడు 
సత్యము తానైనట్టి వాడు
ఆనందముకు మూలమైనవాడు
ఆత్మకు మోదం కలిగించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
89)విశ్వరేతాః -

ప్రపంచం కారణమైన వాడు
తొలి బీజమునైనట్టివాడు
మూలకారణముగానున్నాడు
విశ్వముకు బీజమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
90)ప్రజాభవః -

సకల భూతాలకు కారకుడు
ఆవిర్భావము చేయగలవాడు
జన్మ కారణమైనట్టి వాడు 
ప్రజలకు సృష్టికారకుండు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు