వావ్.. మేడంకు జీవితాంతం గుర్తుండిపోయేలా వీడ్కోలు;- వెంకట్: మొలక ప్రత్యేక ప్రతినిధి
 తమకు ఇష్టమైన ఉపాధ్యాయులు పాఠశాల వదిలి వెళ్లిపోతుంటే విద్యార్థులు ఎంతగానో బాదపడుతూ గురువుకు వీడ్కోలు పలుకుతుంటారు.


వావ్.. మేడంకు జీవితాంతం గుర్తుండిపోయేలా స్టూడెంట్స్ వినూత్నంగా వీడ్కోలు
 తమకు ఇష్టమైన ఉపాధ్యాయులు పాఠశాల వదిలి వెళ్లిపోతుంటే విద్యార్థులు ఎంతగానో బాధపడుతూ గురువుకు వీడ్కోలు పలుకుతుంటారు. అయితే దీనికి భిన్నంగా తాజాగా తమ ప్రిన్సిపాల్ వీఆర్ఎస్ తీసుకున్నందుకు గౌరవంతో వినూత్నంగా వీడ్కోలు పలికారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తాజాగా (వీఆర్ఎస్) స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డప్పు చప్పుల్ల మధ్య ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శశికళా రెడ్డిని గుర్రపు రథంపై మెడికల్ కాలేజీ ఆవరణలో తిప్పారు. దీంతో ‘థాంక్యూ మేడమ్’ అంటూ విద్యార్థుల అరుపులతో మెడికల్ కాలేజీ మార్మోగిపోయింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

కామెంట్‌లు