తిరుప్పావై ;- వరలక్ష్మి యనమండ్ర
25వ రోజు పాశురం
**********
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర, తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద కరుతై ప్పిళ్ళైత్తు కణ్ణన్ వయిత్తిల్ నెరుప్పెన్న నిన్జ నెడు మాలే! యున్నె ఆరుత్తిత్తు వన్దోమ్; పణై తరుతియాకిల్ యామ్పాడి వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్.
***********
 భావము------పంచపదులలో
***********
దేవకి నిను కనవలెనని వరమడిగెనుగా
అందుకు నీవామె గర్భమున పుట్టితివిగా
నీబాలచేష్టలు యశోద చూడదలచెనుగా
ముద్దుబిడ్డవై ఆమెను మురిపించితివిగా
తల్లి ప్రేమకు కన్నయ్యా నీవు లొంగితివిగా..కృష్ణా!

నిరంతరము కంసుడు నిన్నే తలచెనుగా
తలచాడని అతనిని నువు విడువలేదుగా
పొగిడినా, తెగిడినా కృష్ణా నీవు మారవుగా
పరై వాద్యమును కృష్ణా మాకివ్వవలెనుగా
స్నాన వ్రతము నీకై చేయుచుంటిమిగా ..కృష్ణా!
********


కామెంట్‌లు