స్వామివివేకానందులవారి ఉద్బోధ;- "సాహితీసన్మిత్ర" ; "పద్యప్రవీణ" కట్టరంజిత్ కుమార్- చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
ఆవివేకనందులవారు;నాదమరచి
నిద్రబోతున్నయువతను,నిద్రలేపి
వారిశక్తిసామర్థ్యాలు వారుగుర్తె
రుగునటులప్రేరణనునిచ్చెనగణితముగ!

02.
తే.గీ.
నవసమాజపునిర్మాణనాయకులుగ
భవితనేలుచుసద్ధర్మబాధ్యతలను
సతమునెరవేర్చవలెనని,సత్యవాక్కు
పలికెస్వామీజియానాడువిలువతోడ!!!

03.
తే.గీ.
అన్నిరంగాలలోముందునందరుండి
మనదుదేశపుఖ్యాతినియినుమడించి
బావుటాయెగిరేసినభరతమాత
మురియుననిజెప్పెస్వామీజిమురిపెముగను!!!

04.
తే.గీ.
మానవత్వపువిలువలు ; మంచిమనసు
మెండుగానుండినిలువెల్లనుండునటుల
యువతపయనించవలెననిభవితకొరకు
నట్లుస్వామీజిజెప్పెనునార్యులార!!!
కామెంట్‌లు