అమ్మ- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు-6302811961.
 బిడ్డకు ఆకలైతే  అమ్మా అన్నం పెట్టు అంటాడు తప్ప నాన్నా అని అడగడు కదా  పిల్లలను పెంచడంలో తల్లి కున్న బాధ్యత  తండ్రికి ఉంటుందా  ఆటల మోజులో అన్నం కూడా మాలిన వాడిని బుజ్జగించి తినరా బాబు అంటూ  అన్నం తినిపించి కబుర్లు చెబుతూ ముద్దలు తినిపించే అమ్మ మనసు  బాబుకి ఉంటుందా  నిజంగా చేయాలని అనుకున్నా తడి చేయగలడా  ఆ పిల్లల ఆకలి ఏమిటో తల్లికి తెలిసినట్లుగా తండ్రికి తెలియదు  ఏదో ఒక క్రమశిక్షణ అది ఇది అంటూ వాళ్ళను ఇబ్బంది పెట్టడం తప్ప  ముద్దుగా ముచ్చటగా వాళ్లు వాళ్లు చేయడానికి అనువైన పరిస్థితులను కల్పించేది తల్లి తప్ప తండ్రి కాదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు  కేరళ గాని త్రిపుర గాని వెళ్ళండి తెలుస్తోంది  స్త్రీ శక్తి ఏమిటో  మగవారిని గడగడలాడించే స్థితి ఆమెకు మాత్రమే ఉంది కేరళ వనితకు హక్కులు ఎవరో ఇచ్చేది కాదు వాటంత అవే వస్తాయి. ఇంటి బాధ్యత గృహిణికి ఎందుకు అప్పగిస్తాడు గృహస్తు  అంటే  బాధ్యత తెలిసి ప్రవర్తించేది భార్య  ఉదాహరణకు కూరలు విపనిలో విపరీతమైన ధరలలో ఉన్నాయి  100 రూపాయలు తీసుకు వెళితే ఒకటిన్నర కేజీ కూడా రాని పరిస్థితి  ఎంత ఖర్చు చేస్తే ఆ ఇంటికి సరిపోతుంది  అందుకు ఆమె ఏం చేస్తుందో చూస్తున్నారా ఒకరోజు మిగిలిన పెరుగుతో  తిరగమోత వేసి  దానినే కూరగా వాడుతుంది  ఇంకొక రోజు పచ్చి పులుసు పెడుతుంది  ఆ పులుపు ఉల్లిపాయ  కమ్మటి రుచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది  తేలికగా జీర్ణం అవుతుంది దానికి ఖర్చు లేదు  మరొక రోజు పులగం  బియ్యం పెసరపప్పు తప్ప మరి ఏమి అవసరం లేదు  దానికి కూర కూడా  అవసరం లేదు కొంచెం బెల్లం నంజుకుని తింటే సరిపోతుంది  ఇంకొకరోజు కిచిడి  ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త వంటకం విఫణిని వెళ్లకుండా ఉండే మార్గంలో ఏర్పాటు చేసుకుంటుంది.
ఎంత పొదుపు చేయడానికి అవకాశం ఉంటుందో అంత ఆవిడ చేస్తుంది  ఆవిడ మాటల్లో కానీ చేతల్లో కానీ  పిల్లలలో అసంతృప్తి లేకుండా  ఇవాళ కొత్త కూర  ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు అంటూ వారిని ప్రలోభ పెడుతూ  దానిపై ఆసక్తి కలిగిస్తుంది  ఒకరోజు తన పెరట్లో తాను పెంచిన తోటకూర  ఇంకొక రోజు  గోంగూర  కొంచెం శనగపప్పులో గోంగూర వేస్తే దాని రుచి అమృతం  దానితోపాటు దానిలో ఐరన్  కూడా బలవర్ధకమైనది కనుక  పిల్లలు ఆత్రంగా తింటారు  ఇలాంటి చిట్కాలు మగవాడికి తెలుస్తాయా  తన భర్త తనకిచ్చిన  డబ్బును సద్వినియోగం చేయడం అనేది  ఆడవారికి తెలిసినంతగా మగవారికి తెలియదు అన్నది  జగమెరిగిన సత్యం  బాధ్యతలను హక్కులను సమానంగా చూస్తూ  వాటిని సద్వినియోగం చేసుకునేది కూడా ఒక్క పడతికి మాత్రమే ఉన్నది  అందుకే ఆమె గృహిణి  ఇంటికి రాణి.


కామెంట్‌లు